Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌న‌ను రేపిస్ట్ అని పిలిచిన మ‌హిళ‌కు గ‌ట్టిగా స‌మాధానం చెప్పిన అర్జున్ క‌పూర్‌

  • అర్జున్ కపూర్ రూపానికి వంక‌లు పెట్టిన మ‌హిళ‌
  • రేపిస్ట్ ప‌దాన్ని ఒక మ‌హిళ వాడ‌టం బాధాక‌రం అన్న హీరో
  • ట్వీట్ డిలీట్ చేసిన మ‌హిళ‌
సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక ఒక‌రి అభిప్రాయాన్ని ప‌బ్లిగ్గా వ్య‌క్తం చేయ‌గ‌ల స‌దుపాయం క‌లిగింది. ఇక సెల‌బ్రిటీల‌ను హేళ‌న చేసే వారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. సాధార‌ణంగా ఇలాంటి హేళ‌న‌ల‌కు హీరోయిన్లు బ‌లి అవుతుంటారు. కానీ బాలీవుడ్ అర్జున్ క‌పూర్ విష‌యంలో మ‌రో విధంగా జ‌రిగింది. అత‌ని రూపానికి వంక‌లు పెడుతూ ఒక మ‌హిళ ట్వీట్ చేసింది.

`అర్జున్ క‌పూర్ చూడ‌టానికి భ‌యంక‌రంగా, ఒక రేపిస్ట్‌లాగ క‌నిపిస్తాడు. బాలీవుడ్ నుంచి అత‌న్ని బ‌య‌టికి పంపిస్తే కొత్త వారికి అవ‌కాశం దొరుకుతుంది` అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కి అర్జున్ క‌పూర్ వెంట‌నే స‌మాధానం ఇచ్చాడు. `ఒక మ‌హిళ `రేపిస్ట్‌` అనే ప‌దాన్ని సిగ్గులేకుండా, చాలా సాధార‌ణంగా వాడ‌టం నిజంగా బాధాకరం` అని అర్జున్ ట్వీట్ చేశాడు. దీంతో వెంట‌నే ఆ మ‌హిళ త‌న ట్వీట్‌ను డిలీట్ చేసింది.
arjun kapoor
twitter
trolling
woman
rapist
strong reply

More Telugu News