సోనియాగాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్
- తెలంగాణలో చావులకు సోనియానే కారణం
- ఉన్న తెలంగాణను నెహ్రూ ఊడగొట్టారు
- తెలంగాణ అడిగితే కాల్చి పారేయాలని ఇందిర అన్నారు
- తెలంగాణ పాలిట కాంగ్రెస్ శనిలా దాపురించింది
ఉన్న తెలంగాణను జవహర్ లాల్ నెహ్రూ ఊడగొట్టారని... తెలంగాణను అడిగితే కాల్చి వేయాలని ఇందిరాగాంధీ అన్నారని... తెలంగాణను ఇస్తామంటూ 14 ఏళ్లు ఏడిపించి, ఆలస్యం చేసి, అనేక మంది చావులకు సోనియాగాంధీ కాణమయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసలు చరిత్ర ఇదేనని చెప్పారు. కాంగ్రెస్ కుటిల బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసని... అందుకే ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు.