నవంబర్ 7న కమల్ పార్టీ ప్రారంభం... అభిమానులతో మంతనాలు!
- అభిమానులతో సమావేశమైన కమలహాసన్
- పార్టీ పెడితే ప్రజా స్పందన ఎలా ఉంటుందంటూ ఆరా
- నవంబర్ 7న పార్టీ ప్రకటన అని అభిమానులకు తెలిపిన కమల్
అందులో భాగంగా చెన్నైలోని ఆళ్వారుపేటలోని తన నివాసంలో అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా చర్చించిన ఆయన పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వారితో చేతులు కలపాలి? పార్టీ ఏర్పాటు తరువాత ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే నవంబర్ 7న పార్టీని ప్రారంభించనున్నట్టు కమల్ తమకు చెప్పినట్టు అభిమానులు తెలిపారు.