ఎవరో? ఏంటో? అంటూ 'తొలిప్రేమ'లో వరుణ్ తేజ్ లుక్ బయటపెట్టిన రాశీ ఖన్నా
- 'తొలిప్రేమ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న వరుణ్ తేజ్
- లండన్ లో షూటింగ్
- ఫోన్ లో ఎవరో? ఏంటో? వరుణ్ ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు
ఈ ఫోటో సోషల్ మీడియాలో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనిపై రాశిఖన్నా కామెంట్ చేస్తూ, 'ఈ ఫోటోను 'చూశారా? శీతాకాలం గాలులకు నా హెయిర్ క్లియర్ గా కంట్రోల్ తప్పింది. కానీ, వరుణ్ తేజ్ హాయిగా నవ్వుతూ ఫోన్ లో ఏదో చూసుకుంటున్నాడు. (ఫోనులో) ఎవరో? ఏంటో?' అంటూ ఆసక్తిగా అభిమానులను అడిగింది. కాగా ఈ సినిమాకు నిర్మాతగా బీవీఎస్ఎన్ ప్రసాద్ వ్యవహరిస్తుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.