మీకీ విషయం తెలుసా?.. మహాత్మా గాంధీ మంచి క్రికెటర్!
- బౌలింగ్, బ్యాటింగ్లో విశేష ప్రతిభ
- గాంధీపై కొత్త పుస్తకం
- వెలుగులోకి కొత్త విషయాలు
గాంధీ బాల్య స్నేహితుడు రతిలాల్ గేలాభాయ్ మెహతా వ్యాఖ్యలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. గాంధీకి వ్యాయామాలు చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదని, అయితే క్రికెట్ అంటే మాత్రం చాలా ఇష్టపడేవారని మెహతాను ఉటంకిస్తూ పేర్కొన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ చక్కగా చేసేవారని వివరించారు. కాగా, భారత్లో రాజకీయాలు, క్రికెట్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న నేపథ్యంలోనే తానీ పుస్తకాన్ని రాసినట్టు కౌశిక్ తెలిపారు.