హైదరాబాదులో హోంగార్డు హల్ చల్.. వీడియో తీయడంతో పరుగో పరుగు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో హోంగార్డు హల్ చల్.. వీడియో తీయడంతో పరుగో పరుగు!

  • తార్నాకలో రక్షక్ వాహనంలో వచ్చిన హోంగార్డు హల్ చల్
  • స్నేహితులతో గొడవపడుతున్న హోంగార్డును వారించిన స్థానికులు
  • స్థానికులపై దాడికి దిగిన హోం గార్డు
'రక్షక్' వాహనంలో వచ్చిన హోంగార్డు హల్ చల్ చేయడం కలకలం రేగుతోంది. హైదరాబాదులోని తార్నాకలో రక్షక్ వాహనంలో వచ్చిన ఓ హోంగార్డు మద్యం మత్తులో స్నేహితులతో గొడవపడ్డాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై దాడికి దిగాడు.

దీంతో పలువురు దానిని వీడియోల్లో బంధించేందుకు ప్రయత్నించారు. దీనిని గుర్తించిన హోంగార్డు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. బాధితులు ఫిర్యాదు చేసి, తీసిన వీడియోలు చూపించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.  
Hyderabad
tarnaka
home guard

More Telugu News