బతుకమ్మ సంబురాల్లో పాల్గొని డ్యాన్స్ చేసిన రామ్ చరణ్, ఉపాసన వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బతుకమ్మ సంబురాల్లో పాల్గొని డ్యాన్స్ చేసిన రామ్ చరణ్, ఉపాసన వీడియో!

  • నిన్న తెలంగాణలో ముగిసిన బతుకమ్మ వేడుకలు 
  • గిల్డ్ ఆఫ్ స‌ర్వీస్ సేవా స‌మాజ్ బాలిక నిల‌యం ఆధ్వ‌ర్యంలో వేడుక 
  • పాల్గొన్న రామ్ చరణ్, ఉపాసన
తెలంగాణ మ‌హిళ‌లు నిన్న స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌ను ఘ‌నంగా జరుపుకున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌ విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలోని గిల్డ్ ఆఫ్ స‌ర్వీస్ సేవా స‌మాజ్ బాలిక నిల‌యం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బ‌తుక‌మ్మ సంబురాల్లో సినీ న‌టుడు రామ్ చ‌ర‌ణ్, ఆయ‌న భార్య ఉపాస‌న పాల్గొన్నారు. బాలిక‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ ఆడారు. ఈ సంద‌ర్భంగా డ్యాన్స్ వేసి అంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచారు.

ఈ విష‌యాన్ని ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోను పోస్ట్ చేసింది. రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌తో క‌లిసి ఫొటోలు దిగ‌డానికి గిల్డ్ ఆఫ్ స‌ర్వీస్ సేవా స‌మాజ్ బాలికలు ఉత్సాహం చూపించారు.
ram charan

More Telugu News