మ‌హార్న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపిన హీరో సూర్య‌... ఆలోచింప‌జేస్తున్న ట్విట్ట‌ర్ పోస్ట్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌హార్న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపిన హీరో సూర్య‌... ఆలోచింప‌జేస్తున్న ట్విట్ట‌ర్ పోస్ట్‌

  • మ‌హిళ‌ల‌ను దుర్గ, స‌ర‌స్వ‌తీ, ల‌క్ష్మీల‌తో పోల్చిన హీరో
  • స‌మ‌స్య‌ల‌ను క్లుప్తంగా వ‌ర్ణించినందుకు మ‌న్న‌న‌లు
తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకున్న మ‌హార్న‌వ‌మి సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇందుకోసం ఆయ‌న పెట్టిన పోస్టు ఆలోచింప‌జేసేలా ఉంది. నేటి స‌మాజంలో మ‌హిళ‌లు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌ను దేవ‌త‌ల‌కు అనుసంధానం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

 `ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని.. ఏ సరస్వతీ బ‌డికి వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మీ డబ్బు కోసం తన భర్తను ప్రాధేయపడకూడదని.. కట్నానికి ఏ పార్వతీ బలి కాకూడదని.. ఏ సీతా నిశ్శ‌బ్దంగా బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని.. ఏ కాళీదేవికి ఫెయిర్నెస్‌ క్రీమ్‌ ఇవ్వకూడదని..ఈ నవమి సందర్భంగా ప్రార్థించండి’ అని సూర్య పోస్ట్‌ చేశారు. పండ‌గ సంద‌ర్భంగా ఒక్క ట్వీట్ ద్వారా మ‌హిళా స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టి, అంద‌రిలో ఆలోచ‌న‌లు క‌లిగించేలా చేసినందుకు నెటిజ‌న్లు ఆయన్ని మెచ్చుకుంటున్నారు.
hero suriya
maharnavami
twitter
tweet
durga
saraswati

More Telugu News