నువ్వెంత, నీ బతుకెంత... అంబేద్కర్ మాటలే మరచిపోయావా?: కంచె ఐలయ్యపై అంబికా కృష్ణ నిప్పులు
- కోట్ల రూపాయలు పన్నులు కట్టే వైశ్యులను అవమానించావు
- చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే
- డిమాండ్ చేసిన టీడీపీ నేత అంబికా కృష్ణ
"న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ట్యాక్స్ కట్టే వైశ్యులను అవమానిస్తావా? ఇటువంటి ఓ మంచి జాతిని ఓ దౌర్భాగ్య, నీచ, నికృష్ణ ఐలయ్యగాడు... ఓ గొట్టంగాడు అంటున్నాడు. వినవయ్యా... నువ్వెంత, నీ బతుకెంత? మీ అమ్మా, నాన్నలు నిన్ను చదివించినప్పుడు మావాడు మంచి ప్రయోజకుడు కావాలని చదివించి ఉంటారు. వాళ్లిప్పుడు బతికున్నారో లేదో తెలియదు. ఇప్పటి నీ స్థితిని చూస్తే వాళ్లు బాధపడతారు. దగ్గర దగ్గర నీకు 66 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులో ఈ రాతలేంటయ్యా? అంబేద్కర్ చెప్పిన మాటలే మరిచావా? రాజ్యాంగం రాసేటప్పుడే ఆయన చెప్పారు. కులాలు, మతాలు లేని దేశంగా ఈ భారతదేశం వెలుగొందాలని" అంటూ విరుచుకుపడ్డారు. ఐలయ్య పుస్తకంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేనున్నామని, చివరిగా ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.