అంత సత్తా ఉన్నప్పుడు.. డబ్బు, మందు, విందులతో ఎందుకు ప్రలోభపెడుతున్నారు?: టీఆర్ఎస్ కు కోదండరామ్ సూటి ప్రశ్న
* టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోంది
* ప్రభుత్వం చేస్తున్న మోసం సింగరేణి కార్మికులకు తెలుసు
* ఈ ఎన్నికలు ప్రభుత్వానికి చెంప పెట్టు కావాలి
సింగరేణి కార్మికులపై తమకు నమ్మకం ఉందని... తమకు ఓట్లు వేసి విజయాన్ని కట్టిబెడతారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందనే విషయం సింగరేణి కార్మికులందరికీ తెలుసని ఆయన అన్నారు. కార్మికుల తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని తెలిపారు.