వచ్చే నెలంతా రాశి ఖన్నా సందడే!
- వరుస సినిమాలతో పలకరించనున్న రాశి ఖన్నా
- 'రాజా ది గ్రేట్' లో ఆమె స్పెషల్ సాంగ్ హైలైట్
- మలయాళంలో ఆమె చేసిన 'విలన్' రిలీజ్ కూడా వచ్చే నెలలోనే
- 'ఆక్సిజన్' తో వచ్చే నెల 27న ఆడియన్స్ ముందుకు
ఆమె స్పెషల్ సాంగ్ చేసిన 'రాజా ది గ్రేట్' వచ్చే నెల 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి ఆమె స్పెషల్ సాంగ్ హైలైట్ అంటున్నారు కనుక, ఆమెకి ఈ సాంగ్ మరింత క్రేజ్ తీసుకువస్తుందనిపిస్తోంది. ఇక మలయాళంలో ఆమె చేసిన 'విలన్' తెలుగులోను వచ్చే నెల 19న విడుదల కానుంది. మోహన్ లాల్ .. విశాల్ ప్రధాన పాత్రలుగా ఈ సినిమా రూపొందింది. ఇక గోపీచంద్ తో చేసిన 'ఆక్సిజన్' వచ్చే నెల 27వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఇలా వచ్చే నెలంతా రాశి ఖన్నా తన గ్లామర్ తో సందడి చేయనుండటం విశేషం.