‘బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ!

  • ట్రోఫీని, ఫ్రైజ్ మనీని అందుకున్న శివబాలాజీ
  • తోటి ఆర్టిస్టుల అభినందనలు అందుకున్న ‘బిగ్ బాస్’ విజేత
‘బిగ్ బాస్’ సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ‘బిగ్ బాస్’ సీజన్ -1 ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫైనల్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ సీజన్ -1 విజేతను ఈ షో వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ‘బిగ్ బాస్’ ఫైనల్ లో శివబాలాజీ, ఆదర్శ్ నిలిచారు. ఎట్టకేలకు, ‘బిగ్ బాస్’ విజేతగా శివబాలాజీ నిలిచాడు.

ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ ట్రోఫీని, మనీ ప్రైజ్ ని జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అందజేశాడు. ఈ సందర్భంగా శివబాలాజీని తోటి ఆర్టిస్టులు ప్రశంసించారు. కాగా, ఈ వేడుకకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లు అందరూ హాజరయ్యారు. ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లకు పలు కేటగిరిల్లో అవార్డులను జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించగా, ఆయా అవార్డులను సంబంధిత ఆర్టిస్ట్ లు అందుకున్నారు.  
బిగ్ బాస్
శివ బాలాజీ

More Telugu News