బిగ్‌బాస్ 11లో స‌ల్మాన్ ఖాన్ పారితోషికం... ఎపిసోడ్‌కి రూ. 11 కోట్లు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్ 11లో స‌ల్మాన్ ఖాన్ పారితోషికం... ఎపిసోడ్‌కి రూ. 11 కోట్లు?

అక్టోబ‌ర్ 1న ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభం కానున్న హిందీ బిగ్‌బాస్ కార్యక్ర‌మం గురించి జాతీయ సినీ మీడియాలో వివిధ వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిలో స‌ల్మాన్ ఖాన్ పారితోషికం గురించిన వార్త ముఖ్యంగా క‌నిపిస్తోంది. గ‌త నాలుగు సీజ‌న్లుగా ఈ కార్య‌క్ర‌మానికి స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరిస్తున్నాడు. అయితే ఈ సీజ‌న్ కోసం స‌ల్మాన్ పెద్ద మొత్తంలో పారితోషికం అందుకుంటున్న‌ట్లు స‌మాచారం.

బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఒక్క ఎపిసోడ్‌కి రూ. 11 కోట్లు చొప్పున‌ స‌ల్మాన్‌కి ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. గ‌త సీజ‌న్‌లో (బిగ్‌బాస్ 10) ఎపిసోడ్‌కి రూ. 8 కోట్ల చొప్పున స‌ల్మాన్ పారితోషికంగా తీసుకున్నాడు. గ‌త సీజ‌న్ నుంచి సాధార‌ణ పౌరుల‌కు కూడా బిగ్‌బాస్‌లో అవ‌కాశం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొంటున్న సెల‌బ్రిటీల‌కు పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తుండ‌గా, సాధార‌ణ పౌరుల‌కు మాత్రం ఎలాంటి పారితోషికం ఇవ్వ‌డం లేద‌నే వార్త కూడా చ‌క్క‌ర్లు కొడుతోంది.
bigg boss
hindi
salman khan
remuneration
colors tv

More Telugu News