ఐలయ్యా.. అన్ని కులాలు ఒక్కటవుతున్నాయ్.. సిద్ధంగా ఉండు: పరిపూర్ణానంద స్వామి
- ఐలయ్య నా తల్లిని కూడా అవమానించాడు
- జకీర్ నాయక్ కంటే ప్రమాదకరమైనవాడు
- డబ్బు కోసం దేశ రహస్యాలను తాకట్టు పెట్టాడు
- ఐలయ్య లాంటి కలుపు మొక్కలను ప్రోత్సహించకండి
కోమట్లు లేకపోతే నీకు నిత్యావసర సరుకులు ఎక్కడ దొరుకుతాయని ప్రశ్నించారు. నువ్వు వేసుకునే సూటు, బూటుకు సమాజం విలువ ఇవ్వదని...నీతిగా ఉన్నప్పుడే సమాజం విలువనిస్తుందని ఐలయ్యను ఉద్దేశించి అన్నారు. 'ఐలయ్యా, నీకు వ్యతిరేకంగా అన్ని కులాలు ఒక్కటవుతున్నాయ్. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. హైందవ మూలాలను దెబ్బ కొట్టాలని ప్రయత్నించకు' అంటూ పరిపూర్ణానంద హెచ్చరించారు. 'హిందూ సమాజం కన్నెర్రజేస్తే తట్టుకోలేవ్' అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో... కంచ ఐలయ్యలాంటి కలుపు మొక్కలను ప్రోత్సహించవద్దని మీడియాను కోరారు.