'రకుల్ ని తీసుకోండి' అంటోన్న కోలీవుడ్ స్టార్ హీరోలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రకుల్ ని తీసుకోండి' అంటోన్న కోలీవుడ్ స్టార్ హీరోలు

  •  తెలుగులో హ్యాట్రిక్ హిట్ కోసం రకుల్ వెయిటింగ్
  •  'స్పైడర్' పుణ్యమా అని కోలీవుడ్ హీరోల దృష్టిలో పడింది
  •  తమ తదుపరి సినిమాల్లో హీరోయిన్ గా రకుల్ కి ప్రాధాన్యతనిస్తోన్న  హీరోలు
  •  అక్కడి హీరోయిన్స్ లో ఆందోళన మొదలు  
తెలుగులో అగ్రకథానాయికగా రకుల్ దూసుకుపోతోంది. ఈ ఏడాది 'రారండోయ్ వేడుక చూద్దాం' .. 'జయ జానకి నాయక' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్న రకుల్, ఈ నెల 27న 'స్పైడర్'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఆమె వుంది. మరో వైపున కోలీవుడ్ లోను ఆమె హవా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 'స్పైడర్' ప్రమోషన్స్ కారణంగా రకుల్ అక్కడి హీరోలందరి దృష్టిలో పడిపోయిందట. కార్తీ జోడీగా ఒక సినిమా చేసిన ఆమె, విశాల్ సినిమా కోసం ఎంపిక అయింది. డేట్స్ సర్దుబాటు చేయలేనని రకుల్ అంటే, ఎప్పుడు వీలైతే అప్పుడే సర్దుబాటు చేయమని విశాల్ అనడం ఆమెకి గల క్రేజ్ కు నిదర్శనం. ఇక అజిత్ .. విజయ్ .. శింబు .. శివ కార్తికేయన్ తదితర హీరోలంతా, తమ తదుపరి చిత్రాల్లో రకుల్ అయితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. అక్కడి హీరోయిన్స్ ను కంగారు పెట్టేసే విషయమే ఇది.   
rakul

More Telugu News