'ఉంగరాల రాంబాబు' ఫ్లాప్ కి సునీల్ కారకుడా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఉంగరాల రాంబాబు' ఫ్లాప్ కి సునీల్ కారకుడా?

  •  ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు సునీల్
  •  'ఉంగరాల రాంబాబు'తో మరో పరాజయం
  •  స్క్రిప్ట్ విషయంలో సునీల్ జోక్యమే కారణమనే టాక్
  •  ఇలాంటి ప్రచారం జరగడం ఇదే మొదటిసారి  
హాస్యంతో పాటు మిగతా రసాలను సునీల్ అద్భుతంగా పోషించగలడు. పాత్రలో ఒదిగిపోవడం కోసం ఆయన ఎంతలా కష్టపడతాడనే విషయాన్ని గతంలో కొన్ని సినిమాలు నిరూపించాయి. ఇక డాన్స్ లోను .. ఫైట్స్ లోను ఆయన తన సత్తా చాటుకున్నాడు. అలాంటి సునీల్ కారణంగానే 'ఉంగరాల రాంబాబు' సినిమా ప్లాప్ అయిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 ఈ సినిమా దర్శకుడు క్రాంతిమాధవ్ ఇంతకుముందు తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకుల నుంచి అభినందనలు తెచ్చిపెట్టాయి. అలాంటిది ఈ సినిమా మాత్రం అందరినీ నిరాశ పరిచింది. అందుకు కారణం స్క్రిప్ట్ విషయంలో సునీల్ జోక్యం చేసుకోవడమేనని చెప్పుకుంటున్నారు. గతంలో సునీల్ పై ఎప్పుడూ ఇలాంటి వార్తలు షికారు చేయలేదు. కానీ ఈ సినిమా విషయంలో ఈ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. 
sunil
miyageorge

More Telugu News