హిందుత్వం జోలికి రాకూడదు: ప్రొ.కంచ ఐలయ్యపై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం
- కంచ ఐలయ్య మతం మారాడు
- వైశ్యులు తమ వ్యాపారాలను న్యాయంగా చేస్తారు
- జాకీర్ నాయక్ పై నిఘా పెట్టినట్లు ఐలయ్యపై కూడా పెట్టి విచారణ జరపాలి
వైశ్యులు తమ వ్యాపారాలను న్యాయంగా చేస్తారని అన్నారు. అంతేగాక, వైశ్యులు సంపాదించిన దాంట్లో పది శాతం సమాజం కోసం ఖర్చు చేస్తారని, అటువంటి వారిని ఐలయ్య స్మగ్లర్లు అని అంటాడా? అని ఆయన ప్రశ్నించారు. ఐలయ్య హిందుత్వం జోలికి రాకూడదని పరిపూర్ణానంద హెచ్చరించారు. ఉగ్రవాదులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జాకీర్ నాయక్ పై ఎలా నిఘా పెట్టారో ఐలయ్యపై కూడా అలాగే నిఘా పెట్టి విచారణ జరిపించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.