కత్రినా కైఫ్ లా గ్లామర్ డాల్ కావాలని ఎంతో కష్టపడిన హనీప్రీత్ సింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కత్రినా కైఫ్ లా గ్లామర్ డాల్ కావాలని ఎంతో కష్టపడిన హనీప్రీత్ సింగ్!

  • రోజుకు మూడు గంటల పాటు వర్కవుట్లు
  • అలసిపోతే 'ధూమ్-3' పాటకు డ్యాన్స్
  •  తగ్గుతున్న అందంపై హనీప్రీత్ ఆందోళన
  • ఆహారపు అలవాట్ల విషయంలోనూ కఠినమే
  • హనీప్రీత్ పర్సనల్ ట్రైనర్ వెల్లడి 
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తరువాత డేరా సచ్చా సౌధా బాధ్యతలు చేపడుతుందని అందరూ భావిస్తూ వచ్చిన హనీప్రీత్ సింగ్, తన అభిమాన నటి అయిన కత్రినా కైఫ్ లా కనిపించాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నేపాల్ కు పారిపోయినట్టు తేల్చిన పోలీసులు, ఆమె కోసం వేట ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. వయసు పెరుగుతున్న కొద్దీ, ఆమెకు తన అందంపై దిగులు ఎక్కువగా ఉండేదని, కత్రినాలా చాలా కాలం అందంగా ఉండాలని కోరుకునే ఆమె, ఎంతో శ్రమించి రోజుకు మూడు గంటల పాటు ఎక్సర్ సైజులు చేసేదని ఆమె పర్సనల్ జిమ్ ట్రైనర్ మీడియాకు వెల్లడించాడు.

 ఎక్సర్ సైజ్ లు చేస్తూ అలసిపోయినట్టు అనిపిస్తే, వెంటనే 'ధూమ్-3'లోని కత్రినా పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ, అలసటను మరచిపోయేదని, గుర్మీత్ కూడా అక్కడే వర్కవుట్లు చేసేవాడని తెలిపాడు. ఆహారపు అలవాట్ల విషయంలో, ఎక్సర్ సైజుల విషయంలో హనీప్రీత్ చాలా కఠినంగా ఉండేదని, ఆమెలా గ్లామర్ డాల్ గా మారిపోవాలన్నది హనీప్రీత్ కోరికని చెప్పాడు. ఇక గుర్మీత్, హనీప్రీత్ అనుక్షణం ఏకాంతంగా గడుపుతూ ఉండేవారని, ఎప్పుడన్నా బయటకు వెళితే, ఒకే రూములో బస చేసేవారని ఓ సాధ్వి వ్యాఖ్యానించింది. కాగా, ప్రస్తుతం పోలీసులు హనీప్రీత్ తో పాటు డేరా ప్రతినిధిగా ఉండి, ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్న ఆదిత్య ఇన్సాన్ కోసం కూడా గాలిస్తున్నారు.
honeypreet
dera
gurmeet

More Telugu News