Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాయ‌కుడి కుమార్తెకు ముద్దులు పంచిన స్మృతి ఇరానీ!

భార‌త పౌర‌స‌త్వం సంపాదించిన పాకిస్థానీ గాయ‌కుడు అద్నాన్ స‌మీ కూతురు మెదీనాను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారాబం చేసింది. కూతుర్ని మంత్రి ఎత్తుకుని, ముద్దాడుతూ, బుజ్జ‌గిస్తున్న ఫొటోల‌ను అద్నాన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. అద్నాన్‌ సమి తన భార్య రోయా, కుమార్తె మెదీనాతో కలిసి కేంద్రమంత్రి స్మృతిని కలుసుకున్నారు.

`ఒక్క ఫొటో వెయ్యి భావాలను పలుకుతుంది. ఇరానీజీ, మెదీనా మధ్య తొలిచూపులోనే ప్రేమ పుట్టింది. అందుకు కృతజ్ఞతలు’ అంటూ అద్నాన్ ఫొటోలు షేర్ చేశాడు. స్మృతి ఇరానీ చేతుల్లో ముసిముసి న‌వ్వులు న‌వ్వుతున్న మెదీనాను ఈ ఫొటోల్లో చూడొచ్చు. గ‌తంలో ఈ దంప‌తులు ప్ర‌ధాని మోదీని కూడా క‌లుసుకున్నారు. అప్పుడు కూడా మెదీనాను మోదీ ముద్దు చేస్తున్న ఫొటోల‌ను అద్నాన్ షేర్ చేశాడు.
adnan sami
smriti irani
medina
roya
twitter

More Telugu News