ఉత్తర కొరియాకు పాకిస్థాన్ సహకరిస్తోంది: అమెరికాలో సుష్మా స్వరాజ్ సంచలన వ్యాఖ్యలు
- పాకిస్థాన్ పై సుష్మ పరోక్ష వ్యాఖ్యలు
- విచారణ జరిపించాలని డిమాండ్
- అమెరికా పర్యటనలో సుష్మ
ప్రస్తుతం సుష్మ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జపాన్ భూభాగం మీదుగా ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టిన నేపథ్యంలో సుష్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దూకుడుగా ముందుకు సాగుతున్న ఉత్తర కొరియా వైఖరిని సుష్మ తప్పుబట్టారు. కొరియా అణు కార్యక్రమాలకు సహకరిస్తున్న వారిపై చర్యలు చేపట్టాల్సిందేనంటూ ఆమె అన్నారు.