రోజూ ఇంటి భోజనం చేస్తున్నారా? అయితే, టైప్ 2 మధుమేహం మీకు దూరమే!
- నిత్యం ఇంటి భోజనం చేసేవారికి టైప్ 2 మధుమేహం దూరం
- హోటల్, బయటి భోజనంతో టైప్-2 డయాబెటిస్
- అమెరికాలోని టీహెచ్ చాన్ స్కూల్ ఆప్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం
వారిలో మొత్తం 9,325 మంది టైప్-2 మధుమేహం బారిన పడినట్లు గుర్తించారు. వారిలో ఎక్కువ మంది వివిధ హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో భోజనం చేసే వారుగా గుర్తించారు. అదే సమయంలో ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తిన్న వారిలో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. దీంతో హోటల్, హాస్టల్ వంటి ఇతర ప్రాంతాల్లో భోజనం చేసే కంటే ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తినేవారిలో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువని తెలిపారు.