ముందస్తు 'సెట్టింగ్' చేసుకోలేక విఫలమయ్యా: వీరేంద్ర సెహ్వాగ్
- బీసీసీఐ పెద్దలు అడిగితేనే దరఖాస్తు చేశాను
- కోహ్లీని అడిగితే ఓకే అని చెప్పాడు
- రవిశాస్త్రిని అడిగితే పోటీ చేయడం లేదన్నాడు
- పెద్దలతో సంబంధాలు లేకనే పదవి రాలేదన్న సెహ్వాగ్
అంతకన్నా ముందు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా అడిగానని, అతనూ అంగీకరించానని చెప్పిన తరువాతే ముందడుగు వేశానని అన్నాడు. అదే సమయంలో రవిశాస్త్రిని కూడా దరఖాస్తు విషయమై అడిగితే, గతంలో తాను ఓ తప్పును చేశానని, ఇకపై అటువంటి తప్పు చేయబోనని, పోటీ పడటం లేదని చెప్పాడని, అందువల్లే తాను నిబంధనల మేరకు దరఖాస్తు చేశానని అన్నాడు. అయితే, బీసీసీఐ పెద్దలతో తనకు దగ్గరి సంబంధాలు లేకపోవడం, ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్లే విఫలమయ్యానని చెప్పాడు.