తెలుగులో యంగ్ హీరోకు జోడీగా రితికా సింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో యంగ్ హీరోకు జోడీగా రితికా సింగ్!

తెలుగు ప్రేక్షకులకు 'గురు' సినిమాతో రితికా సింగ్ పరిచయమైంది. నటన పరంగా ఆమె మంచి మార్కులు కొట్టేసింది. అది బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో, గ్లామర్ పరంగా ఈ అమ్మాయిని వెతుక్కుంటూ పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తమిళంలో లారెన్స్ తో కలిసి 'శివలింగ' చేసిన ఆమె, అక్కడ అవకాశాలను బాగానే దక్కించుకుంటోంది.

ఈ క్రమంలోనే ఈ అమ్మాయికి తెలుగు నుంచి కూడా ఒక ఛాన్స్ వెళ్లింది. రాజశేఖర్ అనే నూతన దర్శకుడు సుధీర్ బాబు కథానాయకుడిగా ఒక సినిమా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన రితికా సింగ్ ను తీసుకున్నాడు. ఈ మూవీలో ఆమె పాత్రకి గల ప్రాముఖ్యత ఎక్కువేనని తెలుస్తోంది. 'శమంతకమణి' తరువాత సుధీర్ బాబు చేస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమా తరువాతైనా రితికా సింగ్ ఇక్కడ వరుస సినిమాలు చేస్తుందేమో చూడాలి.  
sudheer babu
rithika singh

More Telugu News