డాక్టర్ పాత్ర నాకెంతగానో నచ్చింది : కాజల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డాక్టర్ పాత్ర నాకెంతగానో నచ్చింది : కాజల్!

తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ఆ మధ్య వరుస పరాజయాలను చవి చూసిన ఆమె, ఇటీవల వరుస సక్సెస్ లను అందుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం తన కెరియర్ పట్ల ఆమె ఎంతో ఆనందంగా వుంది. తెలుగులో చిరంజీవి సరసన చేసిన 'ఖైదీ నెంబర్ 150' .. రానా జోడీగా చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు హిట్ కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది.

 ఇక అజిత్ తో చేసిన 'వివేగం' భారీ విజయాన్ని అందుకోవడం వలన కలిగిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అంది. విజయ్ తో చేస్తోన్న 'మెర్సెల్' కూడా తప్పకుండా హిట్ కొడుతుందని చెప్పింది. ఈ సినిమాలో తాను డాక్టర్ గా .. మోడ్రన్ లుక్ తో కనిపిస్తానని అంది. తన పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉందనీ, ఈ పాత్ర తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది.   
vijay
kajal

More Telugu News