తెలుగు సినిమాలు చేయననే ప్రచారంలో నిజం లేదు : రానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు సినిమాలు చేయననే ప్రచారంలో నిజం లేదు : రానా

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో రానా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల తెలుగులో ఆయన చేసిన 'ఘాజీ' .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అయితే ఇకపై ఆయన తెలుగు సినిమాలు చేయడనీ .. బాలీవుడ్ సినిమాలకి ప్రాధాన్యతను ఇవ్వనున్నాడని ఓ టీవీ ఛానల్ చెప్పుకొచ్చింది.

దాంతో ఓ అభిమాని ఆవేదనను వ్యక్తం చేస్తూ .. ట్వీట్ పెట్టాడు. అందుకు రానా స్పందిస్తూ ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పాడు. తన తొలి ప్రాధాన్యత తెలుగుకేనని అన్నాడు. తాను తెలుగులో చేసే సినిమాలు తమిళ .. హిందీ భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటానని చెప్పాడు. అలా అక్కడి ప్రేక్షకులకు దగ్గర కావాలనే ముచ్చట కూడా తీర్చుకుంటానని స్పష్టం చేశాడు.     
rana

More Telugu News