అనూహ్య రీతిలో మెక్ గ్రెగోర్ పై విజయం సాధించిన మేవెదర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనూహ్య రీతిలో మెక్ గ్రెగోర్ పై విజయం సాధించిన మేవెదర్

లాస్ వెగాస్ లోని టీ-మొబైల్ అరీనాలో 'ఫైట్ ఆఫ్ ది మిలీనియమ్'గా అభివర్ణించిన పోరులో, ఫ్లాయిడ్ మేవెదర్ అనూహ్య రీతిలో కానర్ మెక్ గ్రెగోర్ ను ఓడించాడు. 10 రౌండ్లపాటు జరిగిన మ్యాచ్ లో పాయింట్ల ఆధారంగా మేవెదర్ గెలుపొందినట్టు నిర్వాహకులు ప్రకటించారు. తొలి రౌండు నుంచి గ్రెగోర్ ఆధిపత్యం కనిపించగా, ఐదో రౌండ్ నుంచి ఆట తీరును మెవెదర్ మార్చేశాడు. ప్రత్యర్థికి ఎంతమాత్రమూ అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయి, తనదైన పంచ్ ల వర్షం కురిపించాడు.

తొలి రౌండ్ లో 10 పాయింట్లు సాధించి, ఆపై రెండు, మూడు రౌండ్లలో 9 పాయింట్లకు పరిమితమైన మెవెదర్, ఆపై మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. నాలుగు నుంచి 8 రౌండ్ల వరకూ వరుసగా పదేసి పాయింట్ల చొప్పున మేవెదర్ సంపాదించుకోగా, గ్రెగోర్ 9 పాయింట్లకే పరిమితమయ్యాడు. కీలకమైన చివరి రౌండ్లలోనూ మేవెదర్ ఆధిపత్యం కొనసాగగా, అప్పటికే అలసిపోయినట్టు కనిపించిన గ్రెగోర్, చేతులెత్తేశాడు. ఈ పోరులో విజయం సాధించిన మేవెదర్ ను బాక్సింగ్ దిగ్గజాలతో పాటు పలువురు అభినందించారు.

More Telugu News