నా సినిమాపై నాకు నమ్మకం లేకపోతే ఎలా?: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'అర్జున్ రెడ్డి' .. ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
గతంలో ట్రైలర్ రిలీజ్ సమయంలో తాను మాట్లాడిన మాటల పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేయడం గురించి ఆయన ప్రస్తావించాడు. తనది ఓవర్ కాన్ఫిడెన్స్ అనీ .. ఎదుగుతున్న దశలో ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ వచ్చిన విమర్శల పట్ల అసహనాన్ని ప్రదర్శించాడు. తన సినిమాపై తనకి కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా? అంటూ ప్రశ్నించాడు. గతంలో తాను మాట్లాడిన తీరు పట్ల అసహనానికి లోనైన వారెవరికీ తాను క్షమాపణలు చెప్పదలచుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఆయన ధోరణి ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.