'జై లవ కుశ' బాబీని టెన్షన్ పెట్టేస్తోందట!
Add ap7am to your home Screen

'జై లవ కుశ' బాబీని టెన్షన్ పెట్టేస్తోందట!

'జై లవ కుశ' సినిమా షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఒక్కో పాత్ర ఒక్కో ప్రత్యేకమైన లుక్ ను కలిగి వుంటుంది. మూడు పాత్రలు తెరపై ఒకే సమయంలో రన్ అవుతూ ఉంటాయి.

అందువలన భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ కూడా వుంది. గ్రాఫిక్స్ విషయంలో ఎంత మాత్రం రాజీ పడొద్దని నిర్మాత కల్యాణ్ రామ్ చెప్పాడట. క్వాలిటీ కోసం కొన్ని షెడ్యూల్స్ ను స్లోగా నడిపించిన బాబీ, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమవుతుందేమోనని టెన్షన్ పడుతున్నాడట. గతంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' రిలీజ్ కి ముందు ఎదురైన పరిస్థితే ఇప్పుడూ ఆయనకి ఎదురైందని చెప్పుకుంటున్నారు.     
ntr
rasikhanna

More Telugu News