ఉత్కల్ రైలు ప్రమాదానికి కారణం అనధికారిక ట్రాక్ నిర్వహణ పనులు!: రైల్వే అధికారుల అనుమానం!

20-08-2017 Sun 07:16 | National
పూరి-హరిద్వార్ రైలు ప్రమాదం వెనక కారణాన్ని విశ్లేషిస్తున్న అధికారులు అనధికారిక ట్రాక్ నిర్వహణ పనులే కారణమని అనుమానిస్తున్నారు. శనివారం సాయంత్రం ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి వద్ద ఈ రైలు ప్రమాదానికి గురైంది. 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి. 23 మంది ప్రాణాలు కోల్పోగా 70 మందికిపైగా గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి గల కారణాలను రైల్వే విశ్లేషిస్తుండగా సీనియర్ అధికారులు మాత్రం అనధికారిక ట్రాక్ నిర్వహణ పనులే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ట్రాక్ పనులు జరుగుతున్నాయని డ్రైవర్‌కు తెలియకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘నిర్వహణ విఫలం’ వల్లే ఇది జరిగిందని, ప్రమాద సమయంలో ఉత్తర రైల్వేకి చెందిన సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు ఘటనా స్థలంలోనే ఉన్నట్టు పేర్కొంటున్నారు.  నిర్వహణ పనులు చేస్తున్న రైల్వేసిబ్బంది ట్రాక్‌పై ఎర్ర జెండా పెట్టడం కానీ, ఇతరత్రా హెచ్చరిక చర్యలు గానీ తీసుకోలేదని అంటున్నారు. ఆ సమయంలో 10-15 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన రైలు ఏకంగా గంటలకు 106 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. 

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more