అదరగొట్టిన తెలంగాణ సంబురాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదరగొట్టిన తెలంగాణ సంబురాలు!

71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ, గోల్కొండ కోట వేదికగా సాగిన తెలంగాణ సంబురాలు అంబరాన్ని అంటాయి. అన్ని కళారూపాలూ కలసి కోట గోడలపై తమ తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటే, ఆహూతులు అచ్చెరువొందారు. 'తకిటతకిటతక తకిటతకితతక...' అన్న శబ్దం నిరంతరాయంగా వినిపిస్తున్న వేళ, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ కళారూపాలను నిపుణులైన కళాకారులు నినాదాలతో హోరెత్తించారు.

ఒగ్గుడోళ్లు, డప్పులు, చిందు యక్షగానం, దాండియా, భాంగ్రా, గుస్సాడి, రాజన్నడోలు, లంబాడా, కొమ్ముకోయ, రాజకోయ, నగారాలు, కొమ్ములు, రాజస్థానీ, మాధురి, అల్ఫా, గుజ్రా, కవ్వాలీ, పేరిణీ, లాస్యం, కూచిపూడి, పన్నెండు మెట్ల కిన్నెర తదితర అన్ని రకాల కళారూపాలూ ఒక్కసారిగా మిన్నుముట్టేలా సంబురాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. ఒక్కో కళారూపాన్నీ జెయింట్ స్క్రీన్స్ పై కెమెరాలు చూపిస్తున్న వేళ,  దాదాపు 1000 మంది కళాకారులు చేసిన ప్రదర్శన నభూతో నభవిష్యతిగా నిలిచింది.

More Telugu News