హను రాఘవపూడిపై ఆ ముద్ర చెరిగిపోతుందా?
ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' కూడా సక్సెస్ జాబితాలోకి చేరిపోయింది. ఈ సినిమా విషయంలోను సెకండాఫ్ విషయంలో కాస్త పట్టుకోల్పోయాడనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 'లై' సినిమాతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకున్న ఆయన, ఈ సినిమా సెకండాఫ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాడని అంటున్నారు. ఈసారి శభాష్ అనిపించుకుంటాడేమో చూడాలి మరి.