హిట్ ఖాయమనే నమ్మకం అప్పుడే కుదిరింది : హను రాఘవపూడి
తాను చిన్నప్పటి నుంచి అర్జున్ కి అభిమానిననీ .. ఆయన సినిమాలు తప్పకుండా చూసేవాడినని చెప్పాడు. నటుడిగానే కాదు .. దర్శకుడిగా కూడా అర్జున్ కి ఎంతో అనుభవం వుందని, అలాంటి అర్జున్ ను కలిసి కథ చెప్పాలంటే కాస్త భయంగానే అనిపించిందనీ, అంతా విన్న తరువాత ఆయన ఓకే చెప్పేశారని అన్నాడు. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడే ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనిపించిందనీ .. ఇప్పటికీ ఆ నమ్మకం అలాగే ఉందని చెప్పుకొచ్చాడు.