'రంగస్థలం' టైటిల్ కి అర్థం చెప్పిన సుకుమార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రంగస్థలం' టైటిల్ కి అర్థం చెప్పిన సుకుమార్!

చరణ్ కథానాయకుడిగా సుకుమార్ 'రంగస్థలం 1985' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఆయన ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి .. ఇందులో రంగస్థల నాటకాల నేపథ్యం ఉంటుందేమోననే సందేహం కొంతమందిలో తలెత్తింది. తాజాగా దర్శకుడు సుకుమార్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

రంగస్థల నాటకాలకు .. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. పల్లెటూళ్లలో ఎవరిగోల వాళ్లదే అన్నట్టుగా వుండరు. కష్టం వచ్చినా .. నష్టం వచ్చినా అంతా ఒక చోట గుమిగూడతారు. ఏం జరిగిందంటూ తెలుసుకుని తమవంతు సహాయ సహకారాలను అందిస్తూ వుంటారు. అలా వాళ్లందరినీ ఒకేచోట చూసినప్పుడు ఆ ఊరు ఒక వేదికలా కనిపిస్తుంది. ప్రతి పల్లెటూరు ఒక రంగస్థలమే కదా అనిపిస్తుంది. అందువల్లనే పల్లె నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఈ టైటిల్ ను పెట్టడం జరిగిందని సుకుమార్ స్పష్టం చేశాడు.     
sukumar

More Telugu News