చంద్రబాబుతో భేటీ అయిన పవన్.. జనసేనాని కోసం తూర్పుగోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న సీఎం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుతో భేటీ అయిన పవన్.. జనసేనాని కోసం తూర్పుగోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న సీఎం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో వీరి సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ బాధితుల అంశంపై బాబుతో పవన్ చర్చించారు. కిడ్నీ సమస్యపై హార్వర్డ్ వైద్య బృందం చేసిన అధ్యయనం నివేదికను ఈ సందర్భంగా చంద్రబాబుకు పవన్ అందించారు.

అంతకు ముందు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో పవన్ కు ఏపీ మంత్రి కామినేని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు. మరోవైపు, పవన్ కల్యాణ్ తో భేటీ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు తన తూర్పుగోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడనున్నారు.

More Telugu News