'స్పైడర్' నుంచి ఊహించని టీజర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'స్పైడర్' నుంచి ఊహించని టీజర్!

మహేశ్ బాబు నటిస్తున్న 'స్పైడర్' చిత్ర నిర్మాతలు ఈ రోజు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. చిత్రంలోని 'బూమ్ బూమ్' అంటూ సాగే పాటకు సంబంధించిన టీజర్ ను ఈ సాయంకాలం విడుదల చేశారు. మహేశ్ అభిమానులకు ఇదొక ఊహించని గిఫ్ట్ అని చెప్పచ్చు. ఇక పూర్తి పాటను ఆగస్టు రెండు సాయంకాలం ఆరు గంటలకు రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. అలాగే, అదే రోజు పాటతో పాటు సినిమా మేకింగ్ వీడియోను కూడా విడుదల చేస్తామని పేర్కొన్నారు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'స్పైడర్' చిత్రం పట్ల అభిమానుల్లో చాలా అంచనాలు వున్నాయి. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.        
Mahesh
rakul

More Telugu News