ఆ దర్శకుడు, హీరో బుక్కే.. పక్కాగా ఆరు సాక్ష్యాలు సిద్ధం చేసిన సిట్... అరెస్ట్ తప్పదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ దర్శకుడు, హీరో బుక్కే.. పక్కాగా ఆరు సాక్ష్యాలు సిద్ధం చేసిన సిట్... అరెస్ట్ తప్పదు!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ సిట్, ఇప్పటివరకూ 9 మందిని విచారించగా, అందులో ఓ దర్శకుడు, హీరోకు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలు లభించాయని, వారు వాడటంతో పాటు ఇతరులకు పంచారని సిట్ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీపీఎస్ - 1985 చట్టం ప్రకారం, వారికి వ్యతిరేకంగా ఆరు సాక్ష్యాలను సేకరించిన సిట్, కేసు పెట్టి, అరెస్ట్ చేయాలని భావిస్తోంది. ఇక ఈ 9 మందిలో నలుగురు గతంలో తాము డ్రగ్స్ వాడామని, ఇప్పుడు వాడటం లేదని చెప్పగా, మిగతావారు తమకు అలవాటే లేదని వెల్లడించారని సమాచారం.

సదరు దర్శకుడు మాత్రం సొంత అవసరాలకు డ్రగ్స్ తెప్పించుకుని, ఆపై తానే సరఫరాదారుగా మారి సహచరులకు డ్రగ్స్ అందించినట్టు సిట్ సాక్ష్యాలు సేకరించింది. ఆయన డ్రగ్స్ వాడటాన్ని తాము చూశామని విచారణలో పాల్గొన్న వారిలో నలుగురు సాక్ష్యాలు చెప్పగా, వాటిని వీడియోలో రికార్డు చేసిన సిట్, అదే ఈ కేసులో కీలకం కానుందని భావిస్తోంది. ఇక విచారణకు హాజరైన ఓ హీరో పోలీసు అధికారి పాత్ర పోషించగా, నిర్మితమైన చిత్రం షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్ లో చాలా రోజులు ఉన్న సమయంలో తాను స్వయంగా డ్రగ్స్ తెచ్చి దర్శకుడికి ఇచ్చానని వాంగ్మూలం ఇచ్చినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. ఇక కేసులు తప్పవని, వీరిద్దరికీ సిట్ అధికారులు విచారణ ముగిసే సమయంలోనే వెల్లడించగా, నవ్వి లైట్ గా తీసుకున్నట్టు కనిపించారని ఓ అధికారి వెల్లడించడం గమనార్హం.

More Telugu News