ఆశ్చర్యపోయేలా 'రాజుగారి గది 2'ను రెడీ చేశారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆశ్చర్యపోయేలా 'రాజుగారి గది 2'ను రెడీ చేశారట!

కథానాయకుడిగా .. నిర్మాతగా నాగార్జునకి గల అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తాను నిర్మించే సినిమాలు .. నటించే సినిమాలను కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. అవుట్ పుట్ సంతృప్తికరంగా అనిపించకపోతే రీ షూట్ కి వెళుతున్నారు. కథనంలో వేగం తగ్గిందనిపిస్తే ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్నారు. అలాగే 'రాజుగారి గది 2' విషయంలోను జరిగింది.

 ఈ సినిమాలో ఆయన కొన్ని సీన్స్ ను  రీషూట్  చేయించారు. గ్రాఫిక్స్ లో మరింత క్వాలిటీ వచ్చేలా చూసుకున్నారు. ఫైనల్ అవుట్ పుట్ చూసుకుంటే చాలా బాగా వచ్చిందట. అదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ .. సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్ 13న విడుదల కానున్న ఈ సినిమాపై ఆయన ఎంతో నమ్మకంతో వున్నారు. నాగ్ మొదటిసారిగా చేస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి మరి.      
nagarjuna
sheerath kapoor

More Telugu News