ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ తర్వాత ఉగ్రవాదుల లక్ష్యదేశం ఇండియానే.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రసంస్థల జాబితాలో నక్సలిజం.. అమెరికా నివేదికలో వెల్లడి!

23-07-2017 Sun 06:45 | National
ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌ల తర్వాత ఉగ్రవాదులు విరుచుకుపడే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. గతంలో ఈ స్థానంలో దాయాది పాకిస్థాన్ ఉండేది. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘నేషనల్ కన్సార్టియం ఫర్ ది స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్సాన్సెస్ టు టెర్రరిజం’ నివేదిక వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా 2016లో మొత్తం 11,072 ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో 927 అంటే 16 శాతం భారత్‌లోనే జరిగాయి. 2015లో 798 జరిగాయి. అలాగే దాడుల వల్ల మరణాలు కూడా పెరిగాయి. 2015లో 289 మంది మృత్యువాత పడగా గతేడాది వాటి సంఖ్య 337 మంది అంటే 17 శాతానికి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య కూడా 2015తో పోలిస్తే పెరిగింది. ఆ ఏడాది 500 మంది క్షతగాత్రులు కాగా, గతేడాది 636 మంది గాయపడ్డారు. అదే సమయంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయి. 2015లో ఆ దేశంలో 1,010 దాడులు జరగ్గా 2016లో 734కు తగ్గాయి.

అమెరికా నివేదిక వెల్లడించిన విషయాల్లో మరో అత్యంత ఆశ్చర్యపరిచే విషయం నక్సలిజం. ప్రపంచాన్నివణికిస్తున్న ఉగ్రసంస్థల్లో నక్సలిజాన్ని కూడా చేర్చింది. ఇస్లామిక్ స్టేట్, తాలిబన్ల తర్వాత నక్సల్సే అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ఆ తర్వాత బొకొహరమ్ అని తేల్చి చెప్పింది. గతేడాది జరిగిన 336 ఉగ్రదాడుల్లో  సీపీఐ (మావోయిస్ట్) హస్తం ఉందని తెలిపింది. ఈ దాడుల్లో 174 మంది మృతి చెందారని, 141 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇక 2016లో దేశంలో జరిగిన దాడుల్లో సగం జమ్ముకశ్మీర్, చత్తీస్‌గఢ్, మణిపూర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనే జరిగినట్టు అమెరికా నివేదిక వివరించింది.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more