డ్ర‌గ్స్ కేసులో నాకు కూడా నోటీసులు రావ‌చ్చు.. వస్తే వెళతా!: రామ్ గోపాల్ వ‌ర్మ

22-07-2017 Sat 20:21 | Both States
టాలీవుడ్‌ని కుదిపేస్తోన్న‌ డ్ర‌గ్స్ కేసులో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌తి మ‌నిషికి నోరు ఉంటుందని, ఎవ‌రి అభిప్రాయాలు వారు చెబుతారని తాను కూడా త‌న అభిప్రాయాల‌ను చెబుతూ ఉంటాన‌ని అన్నారు. ఒక‌వేళ త‌న‌కు నోటీసులు వ‌చ్చినా తాను వెళ్లి అధికారుల ముందు కూర్చోవాల్సిందేన‌ని, త‌న‌కు కూడా నోటీసులు రావచ్చని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. తానెప్పుడూ డ్ర‌గ్స్ తీసుకోలేదని, ఒక‌వేళ నోటీసులు వ‌స్తే మాత్రం విచార‌ణ మాత్రం ఎదుర్కోవాల్సిందేన‌ని అన్నారు. తాను ఎన్నో అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తుంటాన‌ని, తాను చెప్పేది ఎవ్వ‌రు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా త‌న‌కు న‌ష్టం ఉండ‌బోదని అన్నారు.

విచార‌ణ‌లో తాన‌యినా, ఎవ‌ర‌యినా త‌ప్పు చేసిన‌ట్లు తేలితే మాత్రం శిక్ష ప‌డుతుంద‌ని వర్మ అన్నారు. అప్పుడే ఆ వ్యక్తిని త‌ప్పుచేసిన‌ వాడిగా చూడాల‌ని వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ఎక్సైజ్ శాఖ అధికారులు ఆత్మ‌స్థైర్యం కోల్పోతున్నామ‌ని మాట్లాడుతున్నార‌ని, ఒకే ఒక్క వ్య‌క్తి త‌న అభిప్రాయం చెప్పినంత మాత్రాన అంత‌పెద్ద పోలీస్ వ్య‌వ‌స్థ ఆత్మ‌స్థైర్యం కోల్పోతుందా? అని ప్ర‌శ్నించారు. న‌రేంద్ర మోదీ చేసేది త‌న‌కు న‌చ్చ‌ద‌ని చెప్పే హ‌క్కు కూడా త‌న‌కు ఉంద‌ని అన్నారు. త‌మ‌ ఇంట్లో కూడా డ్ర‌గ్స్ ఉండొచ్చని, త‌మ ఇంట్లో ప‌నివాడు కూడా వాడుతుండొచ్చని, ఆ విష‌యం గురించి త‌న‌కు తెలిస్తేనే త‌న‌ స్పంద‌న ఉంటుందని అన్నారు. తన వద్ద ప‌నిచేసిన సినీ ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ ఎదుర్కుంటున్నార‌ని, తాను మాత్రం వారు డ్ర‌గ్స్ తీసుకుంటుండ‌గా ఎప్పుడూ చూడ‌లేద‌ని అన్నారు. త‌న‌కు అస‌లు డ్ర‌గ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియ‌దని వ్యాఖ్యానించారు.

డ్ర‌గ్స్‌ను ఎవ్వ‌రూ బ‌హిరంగంగా తీసుకోరు క‌దా? అని వర్మ ప్ర‌శ్నించారు. షాపుల్లో అంద‌రికీ క‌నిపించేలా పెట్ట‌రుక‌దా? అని అడిగారు. ఎవ‌రినీ చిన్న మాట‌ కూడా అన‌కుండా ఉండాలంటే ఎలాగ? అని వ‌ర్మ‌ అన్నారు. తాను ఎటువంటి దుర్భాష వాడ‌కుండా అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాన‌ని అన్నారు. ‘ఒక రామ్ గోపాల్ వ‌ర్మ వంటి వాడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేశాడో ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం కూడా అధికారులకు లేదు’ అని వ్యాఖ్యానించారు. చ‌ట్టాల గురించి, సెక్ష‌న్ల గురించి త‌న‌కు అంత‌గా తెలియ‌ద‌ని, ప్ర‌జాస్వామ్య దేశంలో అభిప్రాయాన్ని తెలిపే హ‌క్కు ఉంద‌ని త‌న‌కు తెలుస‌ని వ‌ర్మ వ్యాఖ్య‌లు  చేశారు.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more