విచారణ పధ్ధతి సీక్రెట్... టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో తనదైన శైలిలో ముందుకెళ్తున్న అకున్ స‌బ‌ర్వాల్‌!

21-07-2017 Fri 16:44 | Both States
టాలీవుడ్‌లో క‌ల‌కలం రేపుతున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో శ‌ర‌వేగంగా విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ కేసును ఛేదించేందుకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సభర్వాల్ త‌న సెల‌వుల‌ను సైతం ర‌ద్దు చేసుకున్న విష‌యం తెలిసిందే. సినీ ప్ర‌ముఖులను విచార‌ణ చేయాల్సి ఉండ‌డంతో ఆయ‌న ఈ కేసులో అత్యంత రహస్యంగా వ్యవహరిస్తున్నారు. తాము టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నామ‌నే విష‌యాన్ని కూడా ఆయ‌న బ‌య‌ట‌కు రానివ్వ‌డం లేదు. విచార‌ణ జ‌రిపే సిట్ అధికారుల‌కు త‌ప్ప అక్క‌డి సిబ్బందికి కూడా ఈ వ్య‌వ‌హారాన్ని తెల‌ప‌కుండా జాగ్ర‌త్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.

సిట్‌ బృందంలోని సభ్యుల్ని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కి నోటీసులు ఇచ్చిన నేప‌థ్యంలో ఎవ‌రెవ‌ర్ని ఏయే అంశాల‌పై ప్ర‌శ్నించాలి, ఎటువంటి సమాచారం రాబట్టాలనే విష‌యాల‌పై ఎంతో స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు. సినీ ప్ర‌ముఖులు అస‌త్యాలు చెప్పే అవ‌కాశాలు ఉండ‌డంతో వారి నుంచి నిజాలు రాబ‌ట్ట‌డానికి అవ‌స‌ర‌మైన ప‌లు ఆధారాల‌ను సిద్ధం చేసుకున్నాకే విచార‌ణ ప్రారంభించారు. ఒక్క‌ రోజులో జరిగే ఇంటరాగేషన్‌ను రెండు, మూడు సెషన్స్‌గా విభజించి ముందుకెళుతున్నారు. ఒక్కో సెషన్‌లో ప్రశ్నించే బాధ్యతను ఒక్కో  టీమ్‌కి అప్పగిస్తున్నారు. ఏ బృందంలో ఏ అధికారి ఉంటారో చివరి నిమిషం వరకు ఎవ్వ‌రికీ తెలియదు. ఇందుకుగానూ 25 మంది అధికారుల‌ను వినియోగిస్తున్నట్లు స‌మాచారం.
 
టాలీవుడ్ ప్ర‌ముఖులు గదిలోకి వెళ్లడానికి ముందు ఎంపికచేసిన అధికారులతో అకున్‌ సభర్వాల్ కాసేపు చ‌ర్చిస్తున్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను ప్ర‌శ్నించిన అనంత‌రం అందుకు సంబంధిత ఫైల్ ని అధికారులు అకున్ స‌బ‌ర్వాల్ కు ఇచ్చి వెళ్తున్నారు. అలాగే తమను ఎవరు విచారిస్తారో తెలుసుకునే అవ‌కాశం కూడా టాలీవుడ్ ప్ర‌ముఖుల‌కి లేదు. ఇప్ప‌టికి ఇద్దరు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను ప్ర‌శ్నించిన అధికారులు ఈ రోజు న‌టుడు సుబ్బ‌రాజును ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంలో నోటీసులు అందుకున్న మ‌రో తొమ్మిది మంది‌ని విచారించాల్సి ఉంది. వారంద‌రి విచార‌ణ‌కూ ఇదే ప‌ద్ధ‌తిని అవ‌లంబిస్తారు. 

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more