నా ఆటోగ్రాఫ్ ను అమ్ముకుంటారా! ఇకపై ఇవ్వను: హాలీవుడ్ దర్శకుడి మండిపాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఆటోగ్రాఫ్ ను అమ్ముకుంటారా! ఇకపై ఇవ్వను: హాలీవుడ్ దర్శకుడి మండిపాటు

‘స్టార్ వార్స్’ సిరీస్ తో హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జార్జ్ ల్యూకాస్ తన అభిమానులపై మండిపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదు. ల్యూకాస్ ఆటోగ్రాఫ్ ను కొందరు 200 డాలర్లకు అమ్మి సొమ్ముచేసుకుంటున్న విషయం ఆయనకు తెలిసింది. ఈ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ‘నేను మీలాగా ఆటోగ్రాఫ్ లు తీసుకుని వాటిని అమ్ముకుంటూ సమయం వృథా చేయలేదు. నా సమయాన్ని సినిమాలు తీస్తూ గడిపాను. అందుకే, ఈ రోజు నా వద్ద ఇంత ఆస్తి ఉంది. సినిమా రంగంలోకి రాకముందు నా చేతిలో నయాపైసా లేదు. ఇలా, నా ఆటోగ్రాఫ్ లు అమ్ముకుని సొమ్ము చేసుకునే బదులు కష్టపడి సంపాదించుకోండి. ఈసారి ఎవ్వరికీ ఆటోగ్రాఫ్ ఇవ్వను’ అని  ఆయన అన్నారు.

More Telugu News