త్రిష '96' మూవీ షూటింగ్ 30 లొకేషన్లలో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిష '96' మూవీ షూటింగ్ 30 లొకేషన్లలో!

తెలుగు తెరకి దూరమైనా .. తమిళంలో మాత్రం త్రిషకి ఇంకా క్రేజ్ తగ్గలేదు. గ్లామర్ తో పాటు నటనకి అవకాశం ఎక్కువగా వుండే పాత్రలను ఎంచుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది. అలా తాజాగా ఆమె కోలీవుడ్లో '96' అనే సినిమా చేస్తోంది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ సినిమాలో త్రిష నటిస్తోంది. 30 లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుండటం విశేషం.

 మొదటి షెడ్యూల్ షూటింగ్ రాజస్థాన్ .. కలకత్తా .. కులుమనాలి .. అండమాన్ లలో జరిపారు. రెండవ షెడ్యూల్ షూటింగ్ ను 'కుంభకోణం'లో జరపడానికి రెడీ అవుతున్నారు. ట్రావెలింగ్ నేపథ్యంలో కొనసాగే కథ ఇది. అందువలన ఇన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేయవలసి వస్తుందని అంటున్నారు. ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు . నందగోపాల్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.   
trisha
vijay setupathi

More Telugu News