వచ్చేనెల 24నే 'యుద్ధం శరణం'

కెరియర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఈ మధ్య కాలంలో నాగచైతన్య సాధిస్తోన్న ఫలితాలు చూస్తుంటే కాలం కలిసొచ్చిందనే అనిపిస్తోంది. 'ప్రేమమ్' సినిమా ఆయన్ని యూత్ కి దగ్గర చేస్తే .. 'రారండోయ్ వేడుక చూద్దాం' ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసింది. అలాంటి చైతూ తన తాజా చిత్రంగా 'యుద్ధం శరణం' సినిమా చేస్తున్నాడు.

ఆర్. వి. మారి ముత్తు దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, రేపటితో షూటింగ్ పూర్తిచేసుకోనుంది. సాధ్యమైనంత త్వరలో టీజర్ ను రిలీజ్ చేసి, వచ్చేనెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పూర్తి  వినోదంతో పాటు సమాజానికి అవసరమైన సందేశం కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో చైతూ హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.  
Go Back to Shorts
chaithu
lavanya tripathi

More Telugu News