సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  ప్రస్తుతం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న లేటెస్ట్ బ్యూటీ అనూ ఇమ్మానుయేల్ మరో భారీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రంలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసిందట.    
*  యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా నటిస్తున్న 'గౌతమ్ నంద' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 16న హైదరాబాదులో నిర్వహిస్తారు. ఈ వేడుకకు పలువురు చిత్ర ప్రముఖులు విచ్చేస్తారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హన్సిక, కేథరీన్ నాయికలుగా నటిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
*  ప్రస్తుతం పవన్ మల్లెల దర్శకత్వంలో తాను నటిస్తున్న చిత్రం కోసం చాలా బరువు తగ్గానని చెబుతున్నాడు యంగ్ హీరో నారా రోహిత్. ఆ పాత్రలో సన్నగా కనపడాలని, అందుకే 21 కిలోల బరువు తగ్గానని రోహిత్ చెప్పాడు.
*  ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న 'దర్శకుడు' చిత్రంలోని 'సండే టూ సాటర్ డే...' అనే పాటను అందాలతార సమంత చేతుల మీదుగా రిలీజ్ చేశారు. పూర్తి ఆడియోను ఈ నెల 15న విడుదల చేస్తారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అశోక్, ఈశా జంటగా నటిస్తున్నారు.   
Pawan
arjun
Anu

More Telugu News