శిరీషను వాళ్లిద్దరూ కలసి ఇలా చంపేశారు... సాక్ష్యాలివిగో!: శిరీష బాబాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శిరీషను వాళ్లిద్దరూ కలసి ఇలా చంపేశారు... సాక్ష్యాలివిగో!: శిరీష బాబాయ్

శిరీషను రాజీవ్, శ్రవణ్ కలసి చంపేశారని ఆమె బాబాయ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శిరీష కేవలం నాలుగు నెలల క్రిందటే రాజీవ్ ఆఫీస్ లో జాయినైందని ఆయన చెప్పారు. బెంగళూరు కేంద్రంగా పని చేసే బ్యూటీ సంస్థకు ఆన్ లైన్ సర్వీస్ ద్వారా శిరీష బ్యూటీషియన్ సేవలందించేదని ఆయన చెప్పారు. కేవలం నాలుగైదు నెలల క్రితమే రాజీవ్ ఆమెకు పరిచయమయ్యాడని ఆయన తెలిపారు. తేజస్విని గురించి ఆది నుంచీ ఈ కేసులో పోలీసులు గోప్యం ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆది నుంచీ శిరీష హుక్కా సేవించింది, మద్యం తాగింది, వారితో గడిపింది అని చెబుతూ, ఆమె కేరక్టర్ అసాసినేషన్ చేయడం ఆరంభించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సరే పోనీ వారు చెప్పినట్టే తన కుమార్తె హుక్కా, మద్యం సేవించింది అనుకుందామన్నా... మరి పోస్టు మార్టం రిపోర్టులో అవెందుకు బయటపడలేదని ఆయన నిలదీశారు.

ఇది సరిపోదా? పోలీసులు చెబుతున్నవన్నీ అబద్ధాలని, ఈ కేసులో జరగుతున్న దర్యాప్తు మొత్తం ఎవరినో కాపాడేందుకని? అని ఆయన ప్రశ్నించారు. తమ శిరీషను మభ్యపెట్టి, వారు కుక్కునూరుపల్లి తీసుకెళ్లారని, అక్కడ వారి కుట్రకు ఆమె అంగీకరించలేదని, అందుకే ఆమెను చిత్రహింసలకు గురి చేశారని ఆయన అన్నారు. కారు దిగి పారిపోతూ, ఆమె సెల్ ఫోన్ లో తన భర్తకు లొకేషన్ షేర్ చేస్తుండగా, ఆ సెల్ ఫోన్ లైటింగ్ ఆధారంగా ఆమెను గుర్తించి, ఆమె దగ్గరకు చేరుకుని, జుట్టు పట్టుకుని కొట్టి హతమార్చారని, అనంతరం ఆర్జే స్టూడియోకి తీసుకొచ్చి ఆత్మహత్య డ్రామా ఆడుతున్నారని ఆయన చెప్పారు. దీనికి కూడా సాక్ష్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

కేవలం శిరీష హత్య జరిగిన రోజే ఆర్జే స్టూడియో సీసీ కెమెరాలు పని చెయ్యలేదని, కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పనిచెయ్యలేదని, ఆఖరుకి ఆర్జే స్టూడియో ఉన్న అపార్ట్ మెంట్ సెల్లార్ లోని కెమెరాలు కూడా పని చెయ్యలేదని పోలీసులు చెబుతున్నారని ఆయన తెలిపారు. అంతే కాకుండా హైదరాబాదుకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల పుటేజ్ పోలీసులకు లభ్యమవ్వకపోవడం ఆశ్చర్యకరమని ఆయన చెప్పారు.

More Telugu News