ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద చంద్ర‌బాబు పూజ‌లు.. పుష్కరాల సమయంలో ఓ సంకల్పం చేశానన్న ఏపీ సీఎం

29-06-2017 Thu 19:21 | Both States
విజ‌య‌వాడ‌లో ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పూజ‌లు చేశారు. ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద ఆయ‌న‌ హార‌తిని తిల‌కించారు. అనంత‌రం చంద్ర‌బాబు మాట్లాడుతూ... త‌మ ప్ర‌భుత్వం చేసిన కృషి వ‌ల్ల గోదావరి నీళ్లు కృష్ణా న‌దిలోకి వ‌స్తున్నాయని అన్నారు. గోదావ‌రి పుష్క‌రాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో తాను ఒక సంక‌ల్పాన్ని చేశానని, రాష్ట్రంలో క‌ర‌వు పూర్తిగా పోవాల‌ని తాను కోరుకున్నాన‌ని అన్నారు.  రాష్ట్రంలో ఒక ప‌క్క గోదావ‌రి, మ‌రో ప‌క్క కృష్ణ ఉన్నాయ‌ని, అంతేగాక‌ పెన్నా, వంశ‌ధార‌, నాగ‌వ‌ళి వంటి న‌దులు ఉన్నాయని, ఆ నీరు వృథాగా వెళ్లి స‌ముద్రంలో క‌లిసిపోకూడదని అన్నారు.

ఆ నీటిని చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటే రాష్ట్రంలో క‌ర‌వు అన్న‌దే ఉండ‌బోద‌ని, తాము న‌దుల‌ నీళ్లను మ‌ళ్లించుకుంటున్నామ‌ని చంద్రబాబు చెప్పారు. తాము దూర‌దృష్టితో ఆలోచించి ముందుకు వెళుతున్నామని అన్నారు. త‌న‌ను ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రిగా ఎంపిక చేసుకున్నారని, తాను ఎన్నిక‌ల్లో గెల‌వ‌గానే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌ద్ద‌కు వెళ్లి పోల‌వ‌రం ముంపు మండ‌లాల‌ను రాష్ట్రానికి ఇవ్వ‌మ‌ని కోరి సాధించాన‌ని అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు తీసుకెళుతున్నామ‌ని చెప్పారు. మ‌రోవైపు ప‌ట్టిసీమ‌ను పూర్తి చేశామ‌ని చెప్పారు. కొంద‌రు రైతుల‌ను రెచ్చగొట్టినా, కోర్టుల‌కు వెళ్లినా తాము ప‌ట్టువీడ‌కుండా స‌మ‌ర్థ‌వంతంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేశామ‌ని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా తాము వాటిని ఎదుర్కుంటూ ముందుకు వెళ‌తామ‌ని అన్నారు.

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more