శిరీషను పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లాను: విచారణలో శ్రవణ్ వెల్లడి

28-06-2017 Wed 08:58 | Both States
శిరీషను పక్కా ప్లాన్ ప్రకారమే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లానని విచారణలో శ్రవణ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరోమారు శ్రవణ్ ను విచారించారు. ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలను శ్రవణ్ తెలిపినట్టు తెలుస్తోంది. తన ఫ్రెండ్‌ శిరీష, ఆమె స్నేహితుడు రాజీవ్‌ మధ్య విభేదాలు పెరిగిపోయాయని, వారిద్దరినీ అక్కడికి తీసుకొస్తానని, ఈ సమస్యను పరిష్కరించాల్సింది మీరేనని తాను ప్రభాకర్ రెడ్డిని కోరినట్టు శ్రవణ్ చెప్పాడు. శిరీషను ఉపయోగించుకుంటే మనకే లాభమని వివరించినట్టు తెలిపాడని తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారం రాజీవ్ కు తెలియకుండా చూసుకుందామని కూడా అన్నాడని తెలుస్తోంది. పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పని శ్రవణ్... కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పాడని సమాచారం. శిరీషకు ఉద్దేశపూర్వకంగానే మద్యం ఎక్కువ పోసినట్టు కూడా తెలిపాడు. తొలిసారి ముగ్గురూ సిగిరెట్ తాగేందుకు వెళ్లగా, రెండోసారి కేవలం రాజీవ్ ను మాత్రమే సిగిరెట్ పేరుతో బయటకు తీసుకొచ్చాడని చెప్పాడు. దీంతో ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయడం, శిరీష అరిచి గోల చేయడం, అక్కడ వివాదం రేగకూడదని రాజీవ్ ఆమెపై దాడి చేశాడని శ్రవణ్ చెప్పినట్టు తెలుస్తోంది. తాము వస్తున్న విషయం కాపలాదారు, హోంగార్డులకు కూడా తెలుసని శ్రవణ్ విచారణలో తెలిపాడు. 

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more