శనగపప్పుకు అరుదైన గౌరవం.. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శనగపప్పుకు అరుదైన గౌరవం.. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు!

భారతీయ  పప్పు ధాన్యం శనగపప్పు (చనా దాల్)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్న పలు కొత్త పదాల్లో చనాదాల్‌ కూడా చోటు సంపాదించుకుంది. త్రైమాసిక నవీకరణలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ 600కుపైగా కొత్త పదాలను సేకరించింది. అందులో చనాదాల్‌ను కూడా చేర్చింది. ఇంగ్లిష్‌ను మరింత విస్తృత పరిచేందుకు జనాల నోళ్లలో నానుతున్న, పాప్యులర్ పదాలను ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరుస్తూ వస్తోంది. ఇందుకోసం జీవనశైలి, తాజా పరిణామాల నుంచి విద్యారంగం వరకు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది.

చనాదాల్‌తోపాటు టెన్నిస్ సంబంధమైన ‘ఫోర్స్‌డ్ ఎర్రర్’, ఆరు గేముల స్కోరును తెలిపే ‘బేగల్’ను కూడా చేర్చింది. వీటితోపాటు ఫుట్‌లెస్ (లెగ్‌లెస్‌కు  సామీప్యం), స్విమ్మర్ (స్పెర్మ్), సన్ ఆఫ్ ఎ బ్యాచిలర్ (సన్ ఆఫ్ ఏ బిచ్‌కు ప్రత్యామ్నాయం)  తదితర పదాలను డిక్షనరీలో చేర్చింది.

More Telugu News