శిరీష కేసులో కీలక విషయాలు వెల్లడించిన శ్రవణ్

27-06-2017 Tue 10:37 | Both States
బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో, ఆమె స్నేహితుడు శ్రవణ్ పోలీసులకు కీలక సమాచారాన్ని అందించాడు. ఈ కేసులో మరో ఇద్దరు ఎస్ఐల పేర్లను ఆయన చెప్పాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు, మే 30, 31న కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి తాను ఫోన్ చేశానని, ఓ సమస్య ఉందని, దాన్ని సెటిల్ చేయాలని కోరానని శ్రవణ్ తెలిపాడు.

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోని ఎస్సై హరీందర్ కు ఫోన్ చేసిన ప్రభాకర్ రెడ్డి, ఈ కేసును ప్రత్యేకంగా చూడాలని 31వ తేదీన కోరాడని, అయితే, దీన్ని మరో ఎస్ఐ శ్రీనివాస్ విచారిస్తున్నట్టు హరీందర్ చెప్పాడని అన్నాడు. ఆ తరువాత మరో రెండు సార్లు ప్రభాకర్ రెడ్డితో తాను మాట్లాడానని, కేసును సెటిల్ చేయడంలో బంజారాహిల్స్ పోలీసులు విఫలం కావడంతోనే, ప్రభాకర్ రెడ్డి తమను కుకునూరుపల్లికి పిలిచారని శ్రవణ్ చెప్పాడు.

జూన్ 4న రాజీవ్, శిరీషలతో కలసి బంజారాహిల్స్ పీఎస్ కు వెళ్లామని, కేసు ఎటూ తేలకపోవడంతోనే 12న కుకునూరుపల్లికి వెళ్లామని అన్నాడు. శిరీషను ఎస్ఐ ప్రభాకర్ ఏం చేశాడన్న విషయం తనకు తెలియదని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు నిన్న రాజీవ్ చెప్పిన అంశాలను, నేడు శ్రవణ్ చెప్పిన అంశాలను బేరీజు వేస్తున్నారు. శ్రవణ్ ను మరింతగా విచారించాల్సి వుందని, నేడు, రేపు శ్రవణ్ ను మరింత లోతుగా ప్రశ్నించి తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more