ఫ్లిప్ కార్ట్ లో ‘మోటో ఎక్స్‌ ఫోర్స్‌’ మోడల్‌ ధరపై భారీ తగ్గింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లిప్ కార్ట్ లో ‘మోటో ఎక్స్‌ ఫోర్స్‌’ మోడల్‌ ధరపై భారీ తగ్గింపు

రెండు వేరియంట్ల‌లో ల‌భ్య‌మ‌వుతున్న‌ మోటో ఎక్స్‌ ఫోర్స్  మోడ‌ళ్ల‌ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో అందిస్తున్న‌ట్లు మొబైల్‌ తయారీ సంస్థ మోటొరోలా తెలిపింది. ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం మోటో ఎక్స్‌ ఫోర్స్‌ 64 జీబీ వేరియంట్ పై 58శాతం వరకు తగ్గింపు ధ‌ర‌తో రూ.15,599కే ల‌భిస్తోంది. ఇక‌ 32జీబీ వేరియంట్ మోటో ఎక్స్ ఫోర్స్‌ను 62శాతం తగ్గింపు ధ‌ర‌తో అందిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ రూ.12,999కే ల‌భిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.4 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో 3జీబీ ర్యామ్‌( వేరియంట్ 1: స్టోరేజ్‌ 64జీబీ, వేరియంట్‌-2 స్టోరేజ్‌ 32జీబీ), 3760 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 21 వెనుక కెమెరా, 5ఎంపీ ముందు కెమెరా ఫీచ‌ర్లుగా ఉన్నాయి.

More Telugu News